![]() |
![]() |
.webp)
జబర్దస్త్ యాంకర్ గా అనసూయ గురించి అందరికీ తెలుసు. ఈ షో ద్వారా ఈమె ఏంటో పాపులారిటీ తెచ్చుకుని తర్వాత మూవీస్ తో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇప్పుడు చేతి నిండా మూవీస్ తో ఖుషీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. మూవీస్, షోస్ ఒక వైపు మరో వైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను, అప్ డేట్స్ ని షేర్ చేస్తుంది. రీసెంట్ గా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పిక్ ని షేర్ చేసి గెస్ చేయండి ఎక్కడున్నానో అని అడిగింది. మొదట కొంతమంది ఎన్ సిసి మెంబర్స్ ఉన్న ఓ ఫోటోలో తాను ఎక్కడ ఉందో కనిపెట్టమంది. అలాగే తర్వాత ఒక ఇంటరెస్టింగ్ ఫోటోని కూడా షేర్ చేసింది.
ఆ పిక్ లో తనని హైలెట్ చేసింది.." చాలామంది కరెక్ట్ గా గెస్ చేశారు. 2000 సంవత్సరంలో న్యూఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో జరిగినప్పుడు తీసిన ఫోటో ఇది. స్కూల్ లెవల్లో నేను ఏపీ జూనియర్ వింగ్ ఎన్ సిసి కమాండర్ ని. అప్పుడు 15 స్టేట్స్ తో పోటీపడి మేము థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నాము. నా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఎన్ సిసి చాలా తోడ్పడింది" అని అప్పటి మెమరీని మరో సారి గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేసింది. ఆ తర్వాత రీసెంట్ ఫోటో ని షేర్ చేసింది. అప్పుడే 24 ఏళ్ళు అయిపొయింది, చాలా ఛేంజ్ అయ్యాను అని పోస్ట్ చేసింది. ఇలా అనసూయ స్కూల్ లెవల్లో ఎన్ సిసి కమాండర్ గా ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.. అనసూయ వరుస సినిమా ఆఫర్స్ తో ఆమె కెరీర్ మంచి ఫామ్ లో ఉంది. ఐనాసరే వీలు చేసుకుని ఫ్యామిలీతో సరదా సమయం గడపడం ఆమెకు ఇష్టం. భర్తతో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటుంది అనసూయ. రీసెంట్ గా తన హజ్బెండ్ తో కలిసి వాలెంటైన్స్ డేని సెలెబ్రేట్ చేసుకుంది. ఆ పిక్స్ ని కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. రంగస్థలం మూవీతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న అనసూయ విమానంలో నటనకు మంచి ప్రశంసలనే అందుకుంది. పుష్ప చిత్రంలో దాక్షాయణి పాత్ర ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే రోల్. ఇక ఇప్పుడు పుష్ప2తో అలరించబోతుంది.
![]() |
![]() |